ముఠామేస్త్రి ని గుర్తు చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ లో ముఠామేస్త్రి ఓ మైలురాయి మూవీగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కోదండరామి రెడ్డి డైరెక్షన్లో మీనా , రోజా హీరోయిన్లు గా రాజ్ కోటి సంగీతం లో వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. ముఖ్యంగా ఈ మూవీ లో చిరు లుక్ కేక పుట్టించింది. ఇక ఇప్పుడు మరోసారి ఆ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు చిరు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న మూవీ వాల్తేరు వీరయ్య. ఈ మూవీ నుండి మొదటి పాట విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23న సాయంత్రం 4.05 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందని చిత్రబృందం వెల్లడించింది. బాస్ పార్టీకి అందరూ సిద్ధం కండి అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.

ఈ పోస్టర్ లో చిరంజీవిని ఆద్యంతం మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు. మల్టీకలర్ లుంగీలో… ఆ లుంగీ పై లోపల టీషర్ట్ ఆపైన మెరుపుల చొక్కా చూస్తేనే వీరయ్యని ఎంత మాస్ గా సాంగ్ లో హైలైట్ చేసారన్నది అద్దం పడుతుంది. చేతికి వాచీ…..కాళ్లకి నల్ల బూట్లు.. మెడలో బంగారు గొలుసుల తో చిరంజీవి మాస్ వీరయ్యని తలపిస్తున్నారు. పాటలో హాట్ బ్యూటీ ఊర్వీశి రౌతేలా మెరుపులు హైలైట్ కానున్నాయి. ఈ పాట కోసం బాలీవుడ్ నుంచి ఏరికోరి మరి అమ్మడిని దిగుమతి చేసారు. ఈపాటని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. ఈసినిమాలో చిరంజీవికి జోడీగా శ్రుతిహాసన్ నటిస్తుండగా , దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది.