సిరియా బాంబు పేలుడు.. పలువురి మృతి

ప్రార్థనా మందిరం బయట బాంబుదాడి

Bomb blast kills several people at shrine near Damascus, Syrian state media report

డమాస్కస్ః సిరియా రాజధాని డమాస్కస్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. సయ్యదా జీనాబ్ ప్రార్థనా మందిరం బయట జరిగిన ఈ దాడిలో పలువురు మృతి చెందగా మరెంతోమంది గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయి. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో భారీ పేలుడు శబ్దం వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించాయి.

సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. పేలుడులో ఎంతమంది మరణించారన్న దానిపై కచ్చిత సమాచారం లేదు. ప్రార్థనా మందిరం వద్ద పేలుడు జరగడం ఈ వారంలో ఇది రెండోసారి. తాజా పేలుడుకు ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. అంతకుముందు జరిగిన దాడి మాత్రం తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. 2017లో జరిగిన పేలుడులో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.