ఎమ్మెల్యే భూమనకు మళ్లీ కరోనా

నిన్న నిర్వహించిన పరీక్షల్లో మరోమారు పాజిటివ్

Bhumana Karunakar Reddy
Bhumana Karunakar Reddy

తిరుపతి: వైఎస్‌ఆర్‌సిపి నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి మరోసారి కరోనా సోకింది. ఆగస్టులో తొలిసారి కరోనా బారినపడిన ఆయన రుయా ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబులో నిన్న నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోమారు పరీక్షలు చేయించుకుంటానని, ఫలితాన్ని బట్టి తదుపరి వైద్య సేవలు పొందుతానని ఎమ్మెల్యే తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/