జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ

కౌంట‌ర్ దాఖ‌లుకు జ‌గ‌న్ స‌మ‌యం కోరిన విషయం విదితమే

Bail revocation petition hearing today
Jagan Bail revocation petition hearing today

Hyderabad: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను హైద‌రాబాద్‌ నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిన విష‌యం విదితమే. ఈ కేసులో సీఎం జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని పిటిష‌నర్‌ కోర్టును కోరారు. పిటిషన్‌పై ఈ నెల 7న విచారణ జరగ్గా కౌంట‌ర్ దాఖ‌లుకు కోర్టును, సీబీఐ అధికారులను జ‌గ‌న్ స‌మ‌యం కోరారు. దీంతో కోర్టు విచార‌ణ‌ను ఈనెల 17కి వాయిదా వేసిన విషయం తెలిసిందే

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/