తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,06,644

corona cases in Telangana
corona cases in Telangana

హైదరాబాద్‌: తెలంగాణ కొత్తగా 1,896 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు మొత్తం 2,06,644 మంది ఈ వైరస్ బారినపడినట్టు అయింది. అలాగే, నిన్న 12 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 1,201కి పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ద్వారా తెలుస్తోంది. మహమ్మారి బారినుంచి గత 24 గంటల్లో 2,067 మంది కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,79,075కు చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 26,368 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 21,724 మంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 50,367 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, వీటితో కలుపుకుని ఇప్పటి వరకు 33,96,839 మందికి పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/