మోడీ వ్యాఖ్యలను సమర్థిస్తావా.. చంద్రబాబూ : వైసీపీ ట్వీట్

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ముస్లిం లు , ఇతర పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మోడీ , అమిత్ షా చేసిన కామెంట్స్ ఏపీలో కూటమి పార్టీకి తీవ్ర ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్నాయి. ఇదే క్రమంలో వైసీపీ టిడిపి – జనసేన లను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.

ప్రధాని మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని వైసీపీ ప్రశ్నించింది. ‘చంద్రబాబూ చూశావా ముస్లింలపై బీజేపీ నిజస్వరూపం! దేశ సంపద ముస్లింలకు ఇస్తే ఊరుకుంటామా? అని స్వయంగా మోదీ గారే చెప్తున్నారు. అలాంటి బీజేపీతో నువ్వు, పవన్ పొత్తు పెట్టుకున్నారు. మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తావా? లేదా మైనారిటీల పక్షాన నిలబడి వ్యతిరేకించే దమ్ము టీడీపీ, జనసేనలకు ఉందా?’ అని YCP ట్వీట్ చేసింది.