ఇరాన్‌ భారీ నష్టపరిహారాన్ని చెల్లించాలి

ఇరాన్ అధికారికంగా క్షమాపణలు చెప్పాలి..ఉక్రెయిన్ అధ్యక్షుడు

Volodymyr Zelensky
Volodymyr Zelensky

కీవ్‌: ఉక్రెయిన్ కు చెందిన బోయింగ్ విమానం తమ వల్లే కూలిపోయిందని… అయితే, కేవలం మానవ తప్పిదం కారణంగానే అది జరిగిందని ఇరాన్ ప్రకటించిన విషయం తేలిసిందే. అయితే ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్పందించారు. జరిగిన ఘటనపై ఇరాన్ పూర్తి స్థాయిలో బహిరంగ విచారణ జరపాలని, దీనికి కారకులైనవారిని చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. దౌత్య మార్గాల ద్వారా అధికారికంగా ఇరాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగిన దానికి భారీ నష్టపరిహారం కూడా చెల్లించాలని అన్నారు.ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా విచారణను ఇరాన్ కొనసాగిస్తుందనే ఆశాభావాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ కు చెందిన ఓ విచారణ బృందం ఇప్పటికే ఇరాన్ లో ఉందని చెప్పారు. 45 మంది నిపుణలతో కూడిన తమ టీమ్ కు ఇరాన్ సహకరించాలని, వారికి కావాల్సిన అన్నింటినీ అందుబాటులో ఉంచాలని కోరారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/