బీఆర్ఎస్ కు మనస్తాపంతో రాజీనామా చేశా – మాజీ ఎమ్మెల్యే రాములు

బిఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఓడిన నేతలే కాదు గెలిచిన ఎమ్మెల్యే లు సైతం పార్టీని వీడుతూ వస్తున్నారు. తాజాగా వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించడం జరిగింది.

తన రాజీనామా కు కారణాలను తాజాగా తెలియజేసారు. వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో అనేక సమస్యలపై తమ వంతుగా కృషి చేశానని వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. కొన్ని రాజకీయ పరిణామాలతో తనకు గుర్తింపు లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు. సోమవారం వైరాలో ఆయన సంబంధించిన వర్గీయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని అనేకమంది నాయకులు ప్రజాప్రతినిధులు రాములు నాయక్ మద్దతుగా నిలిచారు.