విశ్వంభర.. భారీ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ టీం భారీ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసింది. 26 రోజులుపాటు కొనసాగిన ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ నిన్నటితో పూర్తి అయినట్లు మేకర్స్ వెల్లడించారు. ’54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన సెట్లో ఫైట్ షూటింగ్ పూర్తిచేశాం. ఇంటర్వెల్లో వచ్చే ఈ సీన్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది’ అని తెలిపారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తుండ‌గా.. ర‌మ్య ప‌సుపులేటి, సుర‌భి ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ తెరకెక్కిస్తుండ‌గా.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన విశ్వంభర కాన్సెప్ట్‌ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ రాబడుతోంది. మ‌రోవైపు టైటిల్‌ లుక్‌, కాన్సెప్ట్‌ వీడియో సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు అమాంతం పెంచేస్తుంది ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లలోకి రానుంది.