వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో బయటపెట్టాలని ప్రభుత్వానికి నట్టికుమార్ సవాల్

ప్రముఖ నిర్మాత నట్టికుమార్..వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో బయటపెట్టాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఆధారాలతో సహా అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం చెబుతుంది కదా.. మరి సీఎం చినాన్న వివేకాను ఎవరు చంపారో కనిపిఎట్టలేకపోయిన స్థితిలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు.

జగన్, వైవీ సుబ్బారెడ్డి, రోజా, ది గ్రేట్ అంబటి రాంబాబు, సినిమా ఇండస్ట్రీ దేవుడు పోసాని కృష్ణమురళికి చిత్తశుద్ధి ఉంటే వివేకాను ఎవరు చంపారో బయటపెట్టండని ఛాలెంజ్ చేశారు. లేని పక్షంలో చంద్రబాబు అరెస్టును ప్రజలు నమ్మరన్నారు. వివేకా హత్య కేసు నిందితులను పట్టుకున్నప్పుడే చంద్రబాబు అరెస్టును ప్రజలు నమ్ముతారని నట్టికుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.