నేడు గోవర్ధనగిరిధారి అలంకారంలో దర్శనం ఇచ్చిన యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండగ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 21 నుండి మొదలైన బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ఎంత వైభవంగా జరుపుతున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్య లో భక్తులు హాజరవుతున్నారు. రోజుకో రూపంలో లక్ష్మినరసింహ స్వామి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. నేడు ఆరోవ రోజు గోవర్ధనగిరిధారి అలంకారంలో లక్ష్మినరసింహ స్వామి దర్శనం ఇచ్చారు.

ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. స్వామివారిని చూసిన భక్తులు భక్తితన్మయంతో ఉప్పొంగిపోయారు. రాత్రికి అశ్వవాహనంపై ఎదుర్కోలు నిర్వహిస్తారు. ఇక 28న తిరుల్యాణ మహోత్సవం, మార్చి 1న దివ్య విమాన రథోత్సవం, శ్రీమహావిష్ణువు అవతారంలో గరుడవాహన సేవ, రాత్రికి ప్రధానాలయం తిరువీధుల్లో రథోత్సవం, 2న ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, రాత్రికి శ్రీపుష్పయాగం, దోపోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల చివరి రోజు 3న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రికి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.