కృష్ణ వ్రింద విహారి రిలీజ్ డేట్ ప్రకటన

యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి. ఆర్. కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్ శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో హీరో నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి ఈ మూవీని నిర్మించారు. షిర్లీ సేటియా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. రోమ్ కోమ్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ గత కొన్ని రోజులుగా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను మరోసారి అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఈ సినిమాను సెప్టెంబర్ 23న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ షిర్లే సేటియా బుగ్గపై హీరో నాగశౌర్య ఎఫెక్షన్ తో హత్తుకుని ముద్దు పెడుతున్న స్టిల్ రొమాంటిక్ గా వుంది. రీసెంట్ గా విడుదల చేసిన చిత్ర టీజర్ ఆకట్టుకుంది. హీరో నాగశౌర్య ఈ మూవీలో సంప్రదాయ బద్ధమైన బ్రాహ్మణ యువకుడిగా నటించాడు. రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీకి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. సాయి రామ్ సినిమాటోగ్రఫీ తమ్మిరాజు ఎడిటింగ్ ఆర్ట్ రామ్ కుమార్.