మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించడంతోపాటు సీఎం సమాధానం ఇవ్వనున్నారు. అలాగే మార్చి 17 న బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మార్చి 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో జి-20 సదస్సులు జరగనున్న నేపథ్యంలో అంతకుముందే అంటే 25 లేదా 27న బడ్జెట్ సమావేశాలను ముగించనున్నారు. మధ్యలో 22న ఉగాది సందర్భంగా ఆ ఒక్క రోజు లేదా రెండు రోజుల పాటు సెలవు ఇవ్వనున్నారు.