పాదాలు పగలకుండా..

ఆరోగ్య సంరక్షణ

Without breaking the foot
Without breaking the foot

శీతాకాలం లో పాదాల పగుళ్లు చాలా మందిలో ఎదురయ్యే సమస్య దీనివల్ల నొప్పిగా ఉండడం, నడవడం ఇబ్బంది కావడమే కాదు.. పాదాలు అధికంగా కూడా వాస్తాయి. వాతావరణం కారణంగా ఈ సీజన్‌లో కాల్లు పొడిబారుతాయి.

ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మడమల దగ్గర చర్మానికి పగుళ్లు వస్తాయి. పాదాలను సరిగ్గా శుభ్రపరుచుకోకపోవడం. వాతా వరణంలోని కాలుష్యం, మధుమేహం, సొరియాసిస్‌, థైరా యిడ్‌, చర్మ సంబంధమైన సమస్యల వల్ల పాదాలు ఎక్కువగా పగులుతూ ఉంటాయి. మొదట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు.

అవేమిటంటే..
పాదాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పొడిబారిన పాదాలపై దుమ్ము పేరుకు పోతే పగుళ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే పగుళ్లలోకి దుమ్ము వెళితే ఇన్ఫెక్లన్లు రావచ్చు. కాబట్టి పాదాలను తరచూ శుభ్రం చేసుకోవాలి.
తడి లేకుండా తుడుముకోవాలి. సాక్సులు వేసుకుంటే
మరింత రక్షణ ఉంటుంది.
నూనె చక్కటి మాయిశ్చరైజర్‌. పాదాలకు నూనె రాసుకొని, కాసేపు ఉంచాక కడుక్కుంటే, చర్మం పొడిబారకుండా నిరోధించవచ్చు. పగుళ్లు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే నూనెతో మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
తులసి ఆకులు, వేపాకులను ఫంగస్‌, బ్యాక్టీరియా నివారిణులుగా పనిచేస్తాయి. వాటిని నూరి ముద్ద చేసి, కాస్త పసుపును కలిపి పాదాలకు రాసు కుంటే.. పాదాలూ, మడమలూ మృదువుగా మారుతాయి. అంతేకాదు, పాదాలకు రాసుకుంటే..

పాదాలూ, మడమలూ మృదువుగా మారుతాయి. అంతేకాదు, పాదాలకు పగుళ్లు పడి, వాటి నుంచి రక్తం వస్తున్నప్పుడు ఈ మిశ్రమాన్ని ఉదయోగిస్తే త్వరగా నయం అవుతుంది.

గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్‌ కలిపి పాదాలకు రాస్తే పగుళ్లు తగ్గుతాయి. నిద్రపోయే ముదు ఈ మిశ్రమాన్ని రాసి, రాత్రంతా అలా ఉంచేస్తే మంచిది. పగుల్లు తగ్గిన తరువాత మళ్లీ ఆ సమస్య తలెత్తకుండా ఉండాలంటే గ్లిజరిన్‌-రోజవాటర్‌ మిశ్రమాన్ని రాస్తూ ఉండాలి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/