పాత చీరలతో కొత్త డ్రెస్‌

ఫ్యాషన్ ఫ్యాషన్

New dress with old saris
New dress with old sarees

వార్డ్‌రోబ్‌లో అమ్మ పాత చీరలు ఉన్నాయా! వాటని ఏం చేయాలో తెలియక అలాగే దాచి ఉంచుతున్నారా!
అయితే వాటిని బయటకు తీసి ఈ కాలానికి తగ్గ ప్యాషన్‌ డ్రెస్సులుగా మార్చేయండి. లెహెంగా, దుపట్టా,
జాజీ జాకెట్‌.. వంటి వాటిని ప్రత్యేకంగా, ప్రస్తుతం ఫ్యాషన్‌ ట్రెండ్‌ను ఫాలో అవ్వాలనుకునే వారు ప్రయత్నించవచ్చు.

డ్రెస్‌ :

ఆరుగజాల చీరను అందమైన డ్రెస్‌గా లేదా అనార్కలీ గౌనుగా కుట్టించుకోండి. మిగిలిన భాగాన్ని క్రాప్‌ టాప్‌గా ధరిస్తే ఆ లుక్కే వేరు.

దుపట్టా :

బెనారస్‌, ఫ్యాబ్రిక్‌, ఎంబ్రాయిడరీ డిజైన్లు ఉన్న చీరలు దుపట్టాగా బాగుంటాయి. వీటిఇ హెవీ దుపట్టాగా స్టిచ్‌ చేయిస్తే డ్రెస్‌కే అందంవస్తుంది.

లెహెంగా :

చెక్‌ బ్రోకేడ్‌ చీరలు ఉండే వాటిని లెహెంగాలా మార్చేయండి. పార్టీలు, పంక్షన్లకు టాప్‌ మీదకు ఈ సారీ లెహంగా పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.

జాకెట్‌ :

పట్టుచీరను లాంగ్‌ జాకెట్‌గా కుట్టించండి. జాకెట్‌ మీదకు నప్పే లెహంగా ధరిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు.

సూట్‌:

ఈ కాలం అమ్మాయిలు ప్యాంట్‌ సూట్‌లో మెరుస్తున్నారు. ప్యాట్‌సైట్‌ కోసం పట్టు లేదా ఎంబ్రాయిడరీ ఉన్న చీరెలు ఎంచుకోవాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/