మనసంతా నువ్వే…

నేడు వాలెంటైన్స్‌ డే

Valetinen's day
Valentine’s Day

నేడు వాలెంటైన్స్‌ డే. అంటే ప్రేమికుల దినోత్సవం. అమ్మల కోసం మదర్స్‌డే, నాన్నల కోసం ఫాదర్స్‌డే, సోదరీమణుల కోసం సిస్టర్స్‌డే, మహిళల కోసం ఉమెన్స్‌డే ఇలా అందరికీ ప్రత్యేకంగా ఓ రోజు ఉన్నట్టే ప్రేమికుల కోసం ప్రేమికుల రోజు ఉంది. ఆ రోజునే వాలెంటైన్స్‌డే అంటారు. అసలు ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక రోజు అంటూ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరమే లేదు. ప్రేమను ఎప్పుడైనా ఎలాగైనా వ్యక్తం చేయవచ్చు. అయితే వాలెంటైన్స్‌డే జరుపుకోవడం వెనుక ఓ చరిత్ర ఉంది. అసలు వాలెంటైన్స్‌ డే అంటే ఏమిటి? దీనికి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికే ఉంటుంది. ఆ రోజును ప్రేమికుల రోజుగా ఎందుకు గుర్తిస్తారు? ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకొంటారు? తెలుసుకుందాం.
వాలెంటైన్స్‌డే ఎందుకు జరుపుకొంటారు అన్న ప్రశ్నకు రకరకాల సమాధానాలున్నాయి. వేర్వేరు చరిత్రలున్నాయి. అందులో బాగా ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం వాలెంటైన్‌ గురించి. ఈ వాలెం టైన్స్‌డే ఇప్పటిది కాదు. క్రీస్తు శకం 270 నాటిది. హింస, స్వార్థం, ద్వేషం లాంటి దుర్గుణాలపై పోరాడటానికి ప్రేమను మించిన ఆయుధం లేదని నమ్మేవాడు క్రైస్తవ మతగురువు వాలెంటైన్స్‌. క్రీస్తుశకం 270 కాలంలో రోమ్‌లో ఉండేవాడు ఇతను. తాను నమ్మిన ప్రేమ సిద్ధాంతాన్ని యువకులకు బోధించేవాడు. యువతీయువకుల మధ్య ప్రేమ చిగురించేలా చేసేవాడు. అంతేకాదు ప్రేమలో మునిగితేలుతున్న యువతీయు వకులకు దగ్గరుండి మరీ పెళ్లి జరిపించేవాడు. ఆ సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి పేరు క్లాడియస్‌. క్రూరాతిక్రూరమైన రాజు. ప్రేమ పెళ్లిళ్లు కాదు కదా అసలు పెళ్ళిళ్లంటేనే ఆ చక్రవర్తికి ఇష్టం లేదు. అందుకే పెళ్లిళ్లలపై నిషేధం విధించాడు.

ఓవైపు పెళ్లిళ్లు అంటే ఇష్టం లేని రాజు క్లాడియస్‌ మరోవైపు ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహిస్తున్న వాలెంటైన్స్‌. ఆ రాజ్యంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి. ఏం జరుగుతుందా అని క్లాడియస్‌ ఆరా తీశాడు. వాలెంటైన్స్‌ ప్రేమ పాఠాల గురించి తెలిసింది. అంతే ఈ ప్రేమ లకు, పెళ్లిళ్లకు వాలెంటైన్‌ కారణమైన వాలెంటైన్‌ జైలులో ఉండగా జైలు అధికారి కూతురితో ప్రేమలో పడ్డాడు. అయితే వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరితీయించాడు క్లాడి యన్‌. చనిపోయేవరకు ప్రియురాలి గురించే తలంచుకుంటూ ఉన్నాడు వాలెంటైన్‌. ‘యువర్‌ వాలెంటైన్‌ అని ఆమెకు ఓ లేఖ కూడా రాశాడు. అలా యువర్‌ వాలెంటైన్‌ అనే మాట ప్రేమికు డికి పర్యాయపదంగా మారిపోయింది.

ఫిబ్రవరి 14న వాలెంటైన్‌ ను ఉరితీశారు కాబట్టి అదేరోజున వాలెంటైన్స్‌ డే అంటే ప్రేమి కుల రోజు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే భారతదేశంలో మాత్రం ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం 1990వ దశకంలో మొదలైంది. ఆర్థిక సరళీకరణ తర్వాత వాలెంటైన్స్‌ డే ఇండియాలో పాపులర్‌ అయింది. వివాదాలు కూడా ఉన్నాయి.

ఇది ప్రేమకుల రోజు భారతదేశ సంస్కృతి కాదంటూ వ్యతిరేకించే వాళ్లున్నారు. వాలెంటైన్స్‌ డే వచ్చిందంటే చాలు విశ్వహిందూ పరిషత్‌, శివసేన, భజరంగ్‌దళ్‌, శ్రీరాం లాంటి హిందుత్వ సంస్థలు రంగంలోకి దిగుతుంటాయి. ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ ధర్నాలు, ఆందోళనలు, గొడవలు మామూలే.

గులాబీలదే ప్రత్యేకత:

ప్రేమ అంటే ఎవరికైనా ప్రేమ అనగానే గుర్తుకు వచ్చేది రోజాపువ్ఞ్వ: ప్రేమికుల వారోత్సవాలు గతవారం నుంచే మొదలయ్యాయి. ఫిబ్రవరి 7వ తేదీనే విదేశాల్లో ఈ వారోత్సవాల సంబరాల్లో మునిగితేలిపోతారు. వాలెంటైన్స్‌ సందర్భాన్ని పుచ్చుకుని తమ ప్రేమను చాటుతూ తన బా§్‌ుఫ్రెండ్‌ లేదా గర్ల్‌ఫ్రెండ్‌కు గులాబీ పుష్పాన్ని ఇస్తారు. ‘ఐలవ్‌యూ పలుకులకు రోజా పువ్వు తోడైతే ఇక కాదనేదెవరు? ఆ పువ్వు ఒక్కటిస్తే చాలు ప్రియురాలు పడిపోవాల్సిందే. ప్రేమకావ్యంలో మూలవస్తువు అదే ప్రియురాలి హృదయం దోచే తొలి బహుమతి అదే. ప్రేమ వనంలో రోజా విరబూసే ఆ మధురానుభూతే వేరు. ప్రేమకు చిహ్నంగా జంటలు గులాబీ పూలను ఇచ్చుకుంటారు. ప్రేమికులే కాకుండా ప్రేమ వివాహం చేసుకున్న వారు కూడా ఒకరికొకరు రోజా పూలు ఇచ్చుకుంటారు.

వాలెంటైన్స్‌డే వచ్చిందంటే వీటికి ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. ఆ రోజున ప్రతి ప్రేమికుడి, ప్రియురాలి చేతిని ఇది స్పృశిస్తుంది. ప్రతి ప్రేమ హృదయం తన మనసులోని ప్రేమను చెప్పేందుకు ఆ రోజున గులాబీ పుష్పం కోసమే వెతుకుతుంది. ప్రేమ ఒక్కటే కాదు..స్నేహం, వాత్సల్యం, దేవతారాధన లాంటి భావాలకు గులాబీలు అనాదిగా ప్రతీకగా నిలుస్తున్నాయి. ప్రేమ ఉన్నచోట గులాబీ తప్పనిసరిగా ఉంటుంది. ప్రేయసికి రోజూ పువ్వు ఇస్తూ ‘ఐ లవ్వూ అని చెప్పినపుడు తనకు కలిగే ఆనందం ఇంకెన్ని కానుకలు ఇచ్చినా రాదు. అందునా వాలెంటైన్స్‌ వీక్‌లో తొలి రోజు నుంచే తన మనసు దోచుకున్న వారికి ఒక్క రోజూ పూవ్వు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు.

గులాబీకి ఎందుకు ప్రత్యేకత?:

ఈ పూలు అనేక రంగుల్లో పూస్తున్నా ఎర్రగులాబీలే అత్యంత కీలకం. ఎర్రగులాబీ కొన్ని శతాబ్దాలుగా ప్రేమికుల ప్రియనేస్తంగా వెలుగుతోంది. నిజానికి ఎర్ర గులాబీకి ప్రేమ గుబాళింపు అద్దిన ఘనత అందాలరాశి క్లియోపాత్రాది అంటారు చరిత్రకారులు. ఆంటోనీ మీద మనసు పడిన క్లియోపాత్రా అతనికి దగ్గరయ్యేందుకు ఎర్రగులాబీలతో ఓ కార్పెట్‌ను తయారు చేయిస్తుంది. దానిలో తనను చుట్టి ఆంటోనీ దగ్గరకు తీసుకెళ్లమని చెలికత్తెలతో చెబుతోంది. వాళ్లు కార్పెట్‌ను తీసుకెళ్లి ఆంటోనీ ముందు పరిచినప్పుడు ఎర్రగులాబీల మధ్య నుంచి దొర్లి ఆంటోనీ పాదాల వద్దకు చేరుతుంది. ఆ గులాబీలతో పోటీపడే ఆమె కోమలత్వాన్ని, ముగ్ధ మనోహర రూపాన్నీ చూసి మైమరచిపోతాడు ఆంటోనీ, ఆమెకు తన హృదయంలో శాశ్వతస్థానాన్ని కల్పిస్తాడు. ఆనాటి నుంచీ ప్రేమతోనూ ప్రేమికులతోనూ ఎర్రగులాబీకి ముడిపడిందని చెబుతుంటారు.

నెహ్రూకు గులాబీ అంటె ఎందుకు ఇష్టం:

జవహర్‌లాల్‌ నెహ్రూకు గులాబీ పుష్పంతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చిన్నారి ప్రియదర్శినికి సుద్దులు చెబుతూ జైలు నుంచే నెహ్రూ ఎన్నో ఉత్తరాలు రాశారు. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండే ఆ ఉత్తరాలు ఆ తర్వాతి కాలంలో లేఖాసాహిత్యంలో అగ్రస్థానం సంపాదించుకున్నాయి. చిన్న వయసులోనే భార్య చనిపోయినా, నెహ్రూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తల్లి లేని లోటు తెలియకుండా కుమార్తెను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. తన కుమార్తెనే కాదు,చుట్టుపక్కల పిల్లలను కూడా చేరదీసేవారు. ప్రేమగా లాలించేవారు. అందుకే అందరూ ఆయన్ను చాచా నెహ్రూ అని పిలిచేవారు.

ఓసారి నెహ్రూకు ఓ పాఠశాల వార్షికోత్సవంలో ఓ చిన్నారి గులాబీపుప్వును ఇచ్చింది. ఆ పువ్వును తీసుకుని ఆయన తన కోటుకు అలంకరించుకున్నారు. దాంతో ఆ చిన్నారు మొహం ఆనందంతో వెలిగిపోయింది. అప్పటి నుంచి ఆయన కోటుకు గులాబీని అలంకరించుకోవడం మొదలు పెట్టారు.గాంధీగిరీలో కూడా గులాబీ పువ్వుకే ప్రత్యేకస్థానం. శాంతియుతంగా తమ నిరసన తెలియజేసి, ఎదుటి వారి హృదయాన్ని గెలుచుకునేందుకు గులాబీ పువ్వునే ఎంచుకుంటారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉల్లంఘించొద్దంటూ అతివేగం ప్రమాదకరమంటూ స్టూడెంట్స్‌ రోజా పువ్వులను ఇచ్చి వాహనదారులకు అవగాహన కల్పిం చిన సందర్భాలున్నాయి.

తప్పకుండా హెల్మెట్లు ధరించాలని సూచిస్తూ హెల్మెట్లు ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులిచ్చి నిరసన తెలి పారు. లంచం తీసుకోవద్దంటూ ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగు లకు గులాబీలు పంచి వేడుకోవడం కూడా వెరైటీ నిరసనే పార్లమెంటు సమావేశాల్లో సభా కార్యక్రమాలను అడ్డుకోవద్దని కోరుతూ కాంగ్రెస్‌ సభ్యులకు గులాబీ పువ్వులిచ్చి బిజెపి సభ్యులు గాంధీగిరీ చేసిన సందర్భమూ ఉంది. ఊటీలోని రోజ్‌ గార్డెన్స్‌లో ప్రతియేటా నిర్వహించే గులాబీ పువ్వుల ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశంలో నిర్వ హించే అతిపెద్ద గులాబీ పుష్పాల ప్రదర్శన ఇది. రెండ్రోజుల పాటు నిర్వహించే ఈ గులిబీ పువ్వుల ప్రదర్శనను భారీ సంఖ్యలో ప్రేమ జంటలు, పర్యాటకులు సందర్శిస్తారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/