బరువు తగ్గడం సులువే !

ఆరోగ్య సూత్రాలు

Weight loss is easy!

దృఢంగా, చక్కని ఆకృతిలో ఉండే శరీరం సొంతం కావాలంటే డైటింగ్‌, వర్కవుట్స్‌.. ఈ రెండూ ప్రధానం అని భావిస్తాం. అయితే ఫిట్‌గా ఉండేందుకు, బరువు తగ్గేందుకు కొన్న తేలికైన పద్ధతులు ఉన్నాయి. ఉప వాసం, కష్టతరమైన వ్యాయామాలు చేయాల్సిన అవస రం లేకుండానే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. అంటు న్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. వారు ఏంచెబుతున్నారంటే..

ఆహారాన్ని బాగా నమలాలి :

బరువు తగ్గాలనే ఆలోచన ఉన్నవారు ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం బాగా నమలడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో మీరు నెమ్మదిగా తింటారు. అంతేకాదు
కడుపారా తిన్న తృప్తి కలుగుతుంది. ఫలితంగా ఎక్కువగా తినరు.

చిన్న ఫ్లేట్‌ :

ఎంత తింటున్నారు అనేది చాలా ముఖ్యం. మీరు డైటింగ్‌ చేయకున్నా, చిన్న ప్లేట్‌లో తినడం వల్ల ఎక్కువగా తిన్నాము అన్న భావన కలుగుతుంది. మీరు తినే మోతాదు.నీళ్లు ఎక్కువగా ఆకలి వేసినప్పుడు ఏది కనిపిస్తే అది తినేస్తారు. అలాకాకుండా భోజనం చేయడానికి ముందు ఎక్కువగా నీళ్లు తాగాలి దీంతో మీరు తక్కువ తినగానే పొట్ట నిండుగా అనిపిస్తుంది.

Weight loss is easy!
Weight loss is easy!

ఒత్తిడికి లోనవకూడదు. :

ఒత్తిడి, ఉద్వేగం సమయంలో ఎక్కువగా తినేస్తారు. కారణం ఒత్తిడికి లోనయినప్పుడు ఎక్కువగా విడుదలయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ ఆకలిని పెంచుతుంది. అందుచేత ఎప్పుడూ పాజిటివ్‌ ఆలోచనలతో ఉండాలి. అప్పుడే ఆకలిపై నియంత్రణ సాధిస్తారు.

సరిపోనూ నిద్ర :

బరువు పెరగడానికి నిద్రలేమి కూడా ఒక కారణం. చాలినంత నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల విడుదలలో అసమతౌల్యం ఏర్పడి ఉబకాయం సమస్య వస్తుంది. కాబట్టి కంటినిండా నిద్రపోవాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/