వైస్సార్సీపీ పై విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు

వైస్సార్సీపీ కి మళ్లీ ఓటు ఎందుకు వేయాలి?.. విష్ణువర్ధన్ రెడ్డి

అమరావతి : ఏపీలో ఇసుక బంగారం కంటే ఖరీదైనదిగా మారిందని వైస్సార్సీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలోని ఇసుకను వందల కోట్లు, వేల కోట్లకు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారని… సామాన్యుడు ఇసుకను కొనలేక, ఇల్లు కట్టుకోలేని పరిస్థితిని తీసుకొచ్చారని అన్నారు. మద్యం ధరలను పెంచి, సామాన్యుడిని దోచుకుంటున్నారని, పేదల డబ్బుని ఖజానాకు తరలిస్తున్నారని విమర్శించారు.

ఆలయాలపై దాడులు చేస్తూ, దేవుళ్ల రథాలను, విగ్రహాలను ధ్వంసం చేస్తూ, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. దాడులకు పాల్పడిన ఒక్కడిని కూడా ఇంత వరకు పోలీసులు పట్టుకోలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రజాలను అన్ని విధాలుగా దెబ్బతీస్తున్న వైస్సార్సీపీ కి మళ్లీ ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నంచారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/