మరోసారి ఓ ఇంటివాడు కాబోతున్న నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య మరోసారి ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా సమంత తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు నిర్ణయం తీసుకొని ఈ విడాకుల ప్రకటన చేసారు. విడాకులు తీసుకొని వీరు హ్యాపీగా ఉన్నప్పటికీ , అభిమానులు మాత్రం తీవ్ర బాధలో ఉన్నారు. అసలు వీరు విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తున్నారు

. ప్రస్తుతం చైతు తన సన్నిహితుల దగ్గర ఉంటున్నాడట. పెళ్లి తర్వాత కొనుగోలు చేసిన కొత్త ఇంటిని సైతం వదిలిపెట్టి, ఫ్రెండ్స్ తో సమంత జ్ఞాపకాలను మరచిపోయేందుకు ట్రై చేస్తున్నాడట. ఇదిలా ఉంటె తాజాగా జూబ్లిహిల్స్ లో ఓ కాస్ట్లీ బంగ్లాను కొన్నారని.. ప్రస్తుతం ఆ ఇంటికి పునరుద్దరణ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఆ పనులు పూర్తయ్యాక చైతన్య తన సొంత ఇంటికి షిఫ్ట్ అవుతారని తెలుస్తుంది.

ఇక చైతు సినిమాల విషయానికి వస్తే..శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చేసిన లవ్ స్టోరీ మూవీ రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో థాంక్యు మూవీ చేస్తున్నాడు.