బీఆర్ఎస్ బొత్స , సజ్జల కామెంట్స్

దేశ వ్యాప్తంగా ఇప్పుడు బీఆర్ఎస్ పేరు మారుమోగిపోతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్..ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రగతి సాధించాలని బీఆర్ఎస్ పార్టీ ని ప్రకటించారు. దసరా సందర్బంగా జాతీయ పార్టీ ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల రాజకీయ నేతలు, ప్రజలు బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఏపీలోనూ బీఆర్ఎస్ ను స్వాగతిస్తూ ప్లెక్సీ లు వెలువడంతో ఏపీలోను బీఆర్ఎస్ స్థానాలు దక్కించుకోవడం ఖాయం అన్నట్లు ఇప్పటి నుండే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో ఏపీ అధికారపార్టీ వైస్సార్సీపీ నేతలు బీఆర్ఎస్ ఫై స్పందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా..తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ , సజ్జల రామకృష్ణ స్పందించారు.

టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకోవడం వాళ్ల ఇష్టమని , ఏపీలో ఉన్న పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి అవుతుందని అన్నారు. ఎంతమంది పోటీలో ఉంటే అంత మంచిదని, తమ పార్టీపై బీఆర్ఎస్ ప్రభావం ఏం ఉండదని చెప్పుకొచ్చారు. ఇక సజ్జల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలను ఆహ్వానించాల్సిందేనన్నారు. ప్రజల అంశాల పై విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు. పోటీ పెరగటం వల్ల పని తీరు మెరుగుపడి ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. మాది రాజకీయం కోసం రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీ కాదని.. ప్రతి అంశాన్ని పారదర్శకంగా చేస్తున్నామన్నారు. ప్రజలు మా పార్టీని ఓన్ చేసుకొన్నారని , కాబట్టి ప్రజలు మాకే మద్దతు ఇస్తారని నమ్ముతున్నామన్నారు. అంతిమ నిర్ణేతలు ప్రజలేనని అన్నారు. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడాలని మేము అనుకోవడం లేదని.. తెలంగాణ నేతలు మా గురించి మాట్లాడటంతోనే మేము స్పందించాల్సి వచ్చిందన్నారు.