బాధ్యత సరే.. మరి ఆరోగ్యం మాటేమిటి..?

జీవన వికాసం

Responsibility
Responsibility

రోగుల సంరక్షణలో ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని ఈ విషయంలో ఆడవారు తగన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇంట్లోవారి ఆరోగ్యం తప్పకుండా ఒత్తిడికి గురిచేస్తుంది. అయినవారి బాధ చూడటం కష్టమే.

వారిని కంటికి రెప్పలా కాపాడాలనుకోవటం సహజమే. అయితే అదే సమయంలో తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

పరిస్థితులని యధాతథంగా స్వీకరించడం, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఆందోళన పడకపోవడం, మంచి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చేయాలంటున్నారు.

ఇంట్లో ఎవరికైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వారితో పాటు రాత్రింబవళ్లు ఉంటూ వారు కోలుకునే వరకు ఒత్తిడికి గురయ్యేది ఆడవారే.

అయితే ఒత్తిడిని కూడా భరిస్తూ తన బాధ్యతలని సక్రమంగా, సరైన సమయంలో పూర్తి చేసేందుకు ఆడవాళ్లు అలవాటుపడిపోతారు.

ఆ పనిలో పడి తమ గురించి కాని తమ ఆరోగ్య పరిస్థితి గురించి తనలోని మానసిక ఆందోళన గురించి గాని ఏ మాత్రం ఆలోచించరు. అలా మహిళలు తమను తాను నిర్లక్ష్యం చేసుకోవడం తగదని ఒక పరిశోధనలో వెల్లడయింది.

ఇంట్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఇంటి ఇల్లాలు సేవలు చేయడంలో నిమగ్నమవుతారు. మానసిక ఒత్తిడి గురవుతుంటారు. ఆ ఒత్తిడి వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

అయిదు లక్షల మందిని పరిశీలించి జరిపిన ఈ పరిశోధనలో కుటుంబంలోని వారి అనారోగ్యం స్త్రీలని ఒత్తిడికి గురిచేసి వారి ఆయుష్షుపై ప్రభావాన్ని చూపిందస్తుందని వెల్లడయింది.

దీర్ఘకాలిక అనారోగ్యం కలిగిన వారి మంచి చెడ్డలు చూడటంలో అంతర్లీనంగా ఉండే ఎన్నో విషయాలు ఆ ఒత్తిడికి కారణం అవుతాయంటున్నారు.

వయసు మళ్లినవారు, మంచంపై ఉన్నవారి ఆలనా పాలనా చూడటంతో తమపై తాము శ్రద్ధ పెట్టకపోవటం, పూర్తిగా తన ఆరోగ్యాన్ని నిర్లక్షం చేయటం ఒక కారణం .

అయితే పోషకాహారం తీసుకోకపోవడం, సంరక్షణ చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఎక్కువ శ్రమపడటం వంటివి మరో కారణం.

అనారోగ్యంతో ఉన్న వారికంటే అంగవైకల్యానికి గురైన వ్యక్తులు ఇంట్లో ఉంటే ఎక్కువ ఒత్తిడికి గురైనట్లు అధ్యయనంలో తేలింది.

శారీరక శ్రమ, సామాజిక ఒత్తిళ్లు వంటివి కారణం కావచ్చంటున్నారు. మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తుల సంరక్షకులకి ఈ ఒత్తిడి మరీ అధికమంటున్నారు.

మతిమరుపు, మానసిక రుగ్మతల బారిన పడిన వారిని సంరక్షించడంలో సాధారణ స్థాయి కంటే ఒత్తిడి, వేదనతో స్త్రీలు ఎక్కువ ఇబ్బందులకు గురవుతారన్నారు.

రోగనిరోధక వ్యవస్థను కాపాడే తెల్ల రక్తకణాలు చురుకుదనాన్ని కోల్పోతాయని దాంతో హైబిపి, గుండెజబ్బుల బారిన పడే అవకాశాలుంటాయన్నారు.

రోగుల సంరక్షణలో ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని ఈ విషయంలో ఆడవారు తగన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇంట్లోవారి ఆరోగ్యం తప్పకుండా ఒత్తిడికి గురిచేస్తుంది.

అయినవారి బాధ చూడటం కష్టమే. వారిని కంటికి రెప్పలా కాపాడాలనుకోవటం సహజమే. అయితే అదే సమయంలో తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

పరిస్థితులని యధాతథంగా స్వీకరించడం, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఆందోళన పడకపోవడం, మంచి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చేయాలంటున్నారు.

అందుకు ఇంట్లో మిగిలిన వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవాలని, ఒత్తిడిగా ఉన్నప్పుడు రిలాక్స్‌ అయ్యేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతున్నారు. వీలయితే గంటసేపు ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించాలి.

అలాగే కొంచెం ధైర్యంగా, జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.

ఇవన్నీ అనారోగ్యం బారిన పడిన వారిని సంరక్షించడంలో మనం అనారోగ్యానికి గురికాకుండా కాపాడే జాగ్రత్తలు. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా అందరిని చక్కగా చూసుకోగలం ఇది మాత్రం మరువవద్దు.

తాజా జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/