మొలకల్లో పోషకాలు

తృణధాన్యాలను మొలకెత్తించే తింటే ఎంత మంచిదో పెద్దవాళ్లు చెబుతుంటారు. మొలకెత్తేవరకు ఉంచడమంటే కొంత పని అయినప్పటికి అందులో ఉండే పోషకాలు ధాన్యాలను పిండిరూపంలో తీసుకునేకన్నా కూడా ఎక్కువ పోషకాలు ఉంటాయి. అంతేగాక కొంతమంది అమ్మాయిల్లో హార్మోన్ల అసమతుల్యత ఇబ్బంది పెడుతుంటుంది. దాంతో ఏదో ఒక అనారోగ్యానికి గురవుతుంటారు. అటువంటప్పుడు మొలకల్ని తీసుకుంటే మంచిది. మొలకలతో సి విటమిన్‌ ఎక్కువగా

దొరుకుతుంది. శరీరంలోని వ్యర్థాలు పూర్తిగా తొలగిపోతాయి. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మెదడుకు రక్తసరఫరా చేయడంలో మొలకల్లోని పోషకాలు కీలక పాత్ర వహిస్తాయి. వీటిని తీసుకుంటే మెదడు పనితీరు చురుగ్గా ఉండటమే కాదు ఏకాగ్రత కుదురుతుంది.
ఒత్తిడి అదుపులో ఉంటుంది. ముఖ్యంగా బీన్స్‌, నట్స్‌, గింజల నుండి మాంసకృత్తులు బాగా అందుతాయి. తృణధాన్యాల మొలకల్లోను మాంసకృత్తులు దొరుకుతాయి. ఇవి కండరాలను దృఢంగా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని
ఎంత ఎక్కువ తీసుకుంటే
అంత మంచిది.
వీటిలో లభించే పీచు జీర్ణవ్యవస్థ పని తీరును పెంచుతుంది. మొలకల్లో జింక్‌, ఇనుము, కాల్షియం ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ శరీరంలోని అన్ని అవయవాలకు ప్రాణవాయువును సక్రమంగా సరఫరా చేస్తాయి.
ముఖ్యంగా జింక్‌ సంతాన సాఫల్య సమస్యల్ని దూరం చేస్తుంది. పెసలు, సెనగలు, గోధుమలు, బార్లీ, మెంతులు, అవిసెగింజలు, రాగులు, జొన్నలు ఇలా అన్నింటినీ మొలకలు వచ్చేలా చేసుకోవచ్చు. వాటిని ఓ రోజంతా నానబెట్టి మర్నాడు మెత్తని వస్త్రంలో మూటలా కడితే మొకలు వస్తాయి. అలాగే తినడం ఇష్టంలేని వారు ఎండబెట్టి పొడిలా చేసుకోవచ్చు. చపాలీ పిండిలో కొద్దిగా కలుపుకోవచ్చు. లేదా జావలా చేసుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/