జీడిపప్పు పలావ్
రుచి: వెరైటీ వంటకాలు ‘చెలి’ పాఠకుల కోసం

సాధారణంగా జీడిపప్పును స్వీట్లలో వాడుతారు. డ్రైప్రూట్స్‌లాగా తింటారు. జీడిపప్పులు ఎలా తిన్నా రుచిగా ఉంటాయి. కాని ఎక్కువగా ఇంటే ఆరోగ్యానికి అంత మంచివి కావు. అయినా వెరైటీ కోసం వీటితో కొన్ని రకాల వంటు చేస్తారు. వాటిల్లో…
జీడిపప్పు పలావ్
కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం – ఒక కప్పు, నెయ్యి – మూడు టేబుల్ స్పూన్‌లు, జీడిపప్పు – యాభైగ్రాములు, లవంగాలు – రెండు, బిర్యానీ ఆకు – ఒకటి, దాల్చిన చెక్క – చిన్న ముక్క, ఉల్లిపాయ – ఒకటి.
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక టేబుల్‌స్పూన్, పచ్చిమిర్చి – రెండు, కారం – అర టీస్పూన్, పుదీనా కొత్తిమీర పేస్ట్ – రెండుటేబుల్ స్పూన్‌లు, పచ్చిబఠాఠీ – పావుకప్పు, క్యారట్ – ఒకటి, ఉప్పు – తగినంత.
తయారుచేసే విధానం
పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక జీడిపప్పు వేసి వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని వేగించి పక్కన పెట్టాలి.
ఇప్పుడు పాన్‌లో మరికాస్త నెయ్యి వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు వేయాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా కొత్తిమీర పేస్టు వేసి కలపాలి. కారం వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. పచ్చిబఠాణీ, క్యారెట్ ముక్కలు వేసి రెండు మూడు నిమిషాలు వేగించాలి.
మూత పెట్టి చిన్న మంటపై కాసేపు వేగించుకున్న తరువాత బియ్యం వేయాలి. తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి.
అన్నం ఉడికిన తరువాత వేగించి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/