కేంద్రం నిర్ణయానికి రాష్ట్రాన్ని నిందిస్తున్నాడు

వైయస్‌ఆర్‌సిపి నేత విజయసాయిరెడ్డి

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్‌ఆర్‌సిపి నేత విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ హెరిటేజ్‌ సంస్థలో పనిచేస్తున్న నలుగురికి కరోనా సోకి, వారి వల్ల మరో 25 మంది క్వారంటైన్‌ లో ఉన్నారని, వీరంతా త్వరగా కోలుకోవాలనుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ కథనం ప్రచురితం కాకుండా మీడియాను మేనేజ్‌ చేసిన చంద్రబాబును ఏం చేయాలి? బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా? అని ప్రశ్నించారు. అదేవిధంగా టిటిపి హయంలో పది ఇళ్లకో బెల్టు షాపు ఉంటే ఎక్కడా క్యూలు ఉండేవి కావని, జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక బెల్టు షాపులే లేకుండా చేశారు. వైన్‌ షాపుల సంఖ్య తగ్గడం వల్ల జనాల్లో ఆతృత కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ తెచ్చిన మద్య నిషేదాన్ని ఎత్తేసిన వ్యక్తి గుండెలు బాదుకుంటుంటే నవ్వు వస్తుందని అన్నారు. కష్ట జీవులకు ఉపశమనం లేకుండా మద్య నియంత్రణ ఏంటి? షాపులెలా తగ్గిస్తారని నిన్నటికి నిన్న కిందపడి దొర్లాడు. సైకిల్‌ నేతలను దెబ్బకొట్టడానికే ఇదంతా అన్నాడు. ఇపుడు కేంద్రం నిర్ణయానికి రాష్ట్రాన్ని నిందిస్తున్నాడు అంటూ చంద్రబాబుపై విజయసాయి విమర్శలు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/