భార‌త సంత‌తి మ‌హిళాకి అరుదైన గౌర‌వం

వాషింగ్టన్‌: భార‌త సంత‌తి మ‌హిళా న్యాయ‌వాదిని న్యూయార్క్‌లోని ఫెడ‌ర‌ల్ కోర్టు జ‌డ్జిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నామినేట్ చేశారు. స‌రితా కొమ‌టిరెడ్డి అనే భార‌తీయ లాయ‌ర్‌ను యూఎస్ డిస్ట్రిక్ కోర్టు న్యాయమూర్తిగా నామినేట్ చేయ‌డం జ‌రిగింది. కాగా ట్రంప్ ఆమె నామినేషన్‌ను అమెరికా సెనేట్‌కు పంపించార‌ని వైట్ హౌజ్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ప్ర‌స్తుతం కోమటిరెడ్డి తూర్పు జిల్లా యునైటెడ్ స్టేట్స్ అటార్నీ కార్యాలయంలో జనరల్ క్రైమ్స్ డిప్యూటీ చీఫ్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. అలాగే 2018, జూన్ నుంచి 2019, జ‌న‌వ‌రి వ‌ర‌కు ఇంట‌ర్నెష‌న‌ల్ నార్కోటిక్స్ అండ్‌ మనీలాండరింగ్ తాత్కాలిక డిప్యూటీ చీఫ్‌గా కూడా ప‌ని చేశారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/