బరువును తగ్గించే సొరకాయ

ఆహారం – ఆరోగ్యం

తేలిగ్గా అరగటమే కాకుండా, వివిధ పోషకాలను అందిస్తూ శరీర తాపాన్ని తగ్గించటంలో సొరకాయని మించింది లేదంటున్నారు పోషకాహార నిపుణులు… మరి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..


సొరకాయతో క్యాలరీస్ చాలా తక్కువ.. వంద గ్రాముల కాయ నుంచి శరీరానికి అందేవి 15 క్యాలరీలే . నీరు 96 శాతం ఉంటుంది.. వీటిల్లో జీర్ణ శక్తికి సహకరించే పీచు పుష్కలంగా దొరుకుతుంది.. ఇది అతిగా తినే అలవాటుని తగ్గిస్తుంది.. శరీర బరువుని అదుపులో ఉంచుతుంది..

శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పొతే, నీటి నిల్వలు తగ్గి నిస్సత్తువ ఆవరిస్తుంది.. ఈ పరిస్థితి తలెత్తకూడదంటే సొరకాయని తరచూ, తింటే మేలు. ఇది అతి దాహం తగ్గిస్తుంది..

శరీరానికి హాని చేసే కొవ్వు ఇందులో ఉండదు.. వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, రైబోఫ్లే విన్ , జింక్ దయామిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి..

ఇనుముతో పాటు అనపకాయలో ఉండే విటమిన్ బి, సి వ్యాధినిరోధక శక్తిని పెంచితే దీనిలోని పొటాషియం బిపి పెరగకుండా కాపాడుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు దీనిని ఆహారంగా తీసుకుంటే మేలు.. కొద్ది మొత్తంలో లభించే స్మూక్ష్మ పోషక ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/andhra-pradesh/