వీగన్‌ ఫుడ్‌తో జీరో కొలెస్ట్రాల్‌

Zero cholesterol with vegan food
Zero cholesterol with vegan food

ఆధునిక యువత తిండిపై ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నది. మారుతున్న జీవనశైలితో ఊబకాయంతోపాటు గుండెజబులు కూడా పెరుగుతుండడంతో శరీరంలో కొవ్ఞ్వను తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకు కొవ్ఞ్వను తగ్గించే ఆహారాన్ని తీసుకునే ఆన్వేషణ ఆరంభించారు. మాంసహారాన్ని ఎంతగా తగ్గిస్తే అంత ప్రయోజనం అనే వాస్తవాన్ని గమనించి, ఆకుకూరలు, కూరగాయలతో సరిపెట్టుకుంటున్నారు. ఇలా కఠినమైన ఆహారాన్ని తీసుకునేవారిని వీగన్లని అంటారు. వీరు కేవలం శాఖాహారాన్ని మాత్రమే తీసుకునేందుకు కారణం కూడా ఉంది. వీరు విపరీతమైన జంతువ్ఞ ప్రేమికులు. ఈ వీగన్ల గురించి తెలుసుకుందాం.

జంతువ్ఞలంటే ఎవరికైనా ఇష్టమే. ప్రత్యేకంగా పెంపుడు జంతువ్ఞలంటే మరీఇష్టం. వాటికి ఆరోగ్యం బాగలేకపోతే గలగల కొట్టుకుంటారు. వైద్యుల్ని సంప్రదిస్తారు. వాటికి హాని చేస్తే వారిపై కేసులు వేసేందుకు కూడా వెనుకాడరు. ఎందుకంటే వీరు జంతుప్రేమికులే కాదు, వాటి హక్కుల గురించి పోరాడేవారు. అందుకే మనుషుల్ని ప్రేమించే వీళ్లు..జంతువుల హక్కుల కోసం పోరాడుతారు. అందుకు కఠినతరమైన ఆహార నియమాలు పాటిస్తారు. తీసుకునే ఆహారంలో, వేసుకునే దుస్తుల్లోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటారు. వాళ్లతో మాట కలిపితే జంతువుల వేదనను కథలు కథలుగా చెప్పి మనలో ఓ ఉద్యమానికి బీజం వేస్తారు. వారే..పూర్తిగా మొక్కల ద్వారా వచ్చే ఆహారాన్ని మాత్రమే తిని జంతు సంరక్షణకు కృషి చేస్తున్న వీగన్లు,

వీగన్‌ సొసైటీ ప్రారంభం:

-వీగన్‌ సొసైటీ 1944లో ప్రారంభమైంది. ఇద్దరు స్నేహితులు వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్‌ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలన్న ఆవశ్యకతతో ‘ది వీగన్‌ సొసైటీని స్థాపించారు. నేటికి ఈ సంస్థ ప్రారంభమై 75 ఏళ్లు. వరల్డ్‌ వీగన్‌ మాసంగా సెలబ్రేట్‌ చేసుకునే నవంబర్‌ నెలలో పెద్ద ఎత్తున వీగనిజం, వీగన్‌గా ఉంటే కలిగే ప్రయోజనాల గురించి పలు కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. వీగనిజం పాటించే వాళ్లు ముఖ్యంగా కఠినమైన ఆహార పద్ధతులను పాటిస్తారు. కేవలం మొక్కల ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు.

పాలపదార్థాలు గానీ, జంతువుల నుంచి వచ్చే ఏ ఆహారాన్ని తీసుకోరు. కానీ వాటికి ప్రత్యామ్నాయంగా ఆహారంలో పోషక విలువలు తగ్గకుండా జాగ్రత్తలు వహిస్తారు. పాలకు బదులుగా పల్లీల నుంచి తీసిన పాలు, కొబ్బరి, జీడిపప్పుతో చేసిన ఛీజ్‌కేక్‌ లాంటివి తిని పోషకాహారలోపాన్ని అధిగమిస్తారు. వీగన్లు తాము వేసుకునే దుస్తుల్లోనూ జంతు సంబంధమైనవి లేకుండా కేవలం లెనిన్‌, కాటన్‌తో రూపొందిన దుస్తులకే ప్రాధాన్యత ఇస్తారు.

చలిని తట్టు కోవడానికి మనం ధరంచే కోట్లు, బెల్టులు, టోపీల తయారీకి లక్షల కొద్ది మూగజీవుల్ని వధిస్తున్నారనే కారణంతోనే వీగన్లు ఈ దుస్తులను నిషేధిస్తున్నారు. జంతు చర్మంతో తయారవుతున్న ఉత్పత్తులకు బదులుగా కృత్రిమనార, సోయా ఉత్పత్తులు, రీసైకిల్డ్‌ నైలాన్‌, కార్డ్‌ బోర్డులతో రూపొందిన దుస్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక స్టెల్లా మెక్‌క్యాట్నీ, నాస్టీగాళ్‌, మ్యాట్‌ అండ్‌ న్యాట్‌, బియాండ్‌ స్కిన్‌బ్రాండ్లు ప్రస్తుతం వీగన ఫ్యాషన్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు సైతం తక్కువే. వీగన్‌ బ్రాండ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెటా సంస్థ ప్రతి సంవత్సరం వీగన్‌ ఫ్యాషన్‌ అవార్డును కూడా అందజేస్తుంది. వీగన్‌పుడ్‌ బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది.

గుడ్లు, మాసానికి ప్రత్యామ్నాయంగా వెజిటేరియన్‌ గుడ్లను, వెజిటేరియన్‌ మాంసాన్ని అభివృద్ధి చేశారు. ఢిల్లీ ఐఐటికి చెందిన పరిశోధకులు. వెజిటేరియన్‌ మీట్‌గా పిలిచే ఈ ఉత్పత్తుల్లో రుచి, పోషకాల్లో మాంసంలో ఉండే పోషకాలకు ఏ మాత్రం తీసిపోవని తెలిపారు. అంతేకాకుండా జంతువుల నుంచి సంక్రమించే బర్డ్‌ ప్లూ వంటి వ్యాధులు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు. జంతు ప్రేమికులతోపాటు జంతువుల పక్షాన పోరాడుతున్న వీగన్ల సంఖ్య హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్‌ వీగన్ల రాజధానిగా మారుతోంది.

హైదరాబాద్‌ వీగన్స్‌లో 90 శాతం మంది యువతీయువకులే కావడం విశేషం. వీగనిజాన్ని స్వీకరించి రకరకాల ప్రచారాలతో మరికొంత మందిని వీగనిజంలోకి వీరు ఆహ్వానిస్తున్నారు. వీగనిజాన్ని ప్రమోట్‌ చేయడానికి వీకెండ్స్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదైనా ఎస్టారెంట్లలో మనం వీకెండ సెలబ్రేట్‌ చేసుకుంటుంటే ఈ సమూహం అక్కడికి వస్తుంది. మనం బతకడానికి జంతువులు చావాల్సిందేనా అని ఓ ప్రశ్న మనముందు ఉంచి వెళ్లిపోతుంది.

సినిమా థియేటర్‌కు వెళ్తాం. అక్కడ ముఖానికి మాస్కులు వేసుకున్న ఓ గుంపు ఏదో ప్రదర్శిస్తూ కనిపిస్తుంది. వాళ్ల చేతుల్లోని ప్లకార్డుల్లో జంతువుల్ని మనం ఎంతగా హింసిస్తున్నామో ఉంటుంది. సాధారణ మానవుల నుంచి ఇప్పుడు క్రీడాకారులు, సినీతారలు, పారిశ్రామికవేత్తలు వంటి సెలబ్రిటీలు కూడా వీగనిజాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఆచరిస్తున్నారు కూడా.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/