స్మార్ట్ ఫోన్స్ తో డిప్రెషన్

విరివిగా వస్తువుల వాడకం- ఆరోగ్యం పై ప్రభావం

depression with smart phones
depression with smart phones

స్మార్ట్ ఫోన్స్ వాడకం ఎక్కువైన విషయం తెలిసిందే . దీంతో ఎలాంటి అనర్ధాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే.. వీటికి తోడు మరో పెద్ద నష్టం వాటిల్లుతుందని అంటున్నారు కెనడాకు చెందిన సైంటిస్ట్స్ .. స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా వాడటం వాళ్ళ డిప్రెషన్ బారిన పడి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా వస్తాయని కెనడాకు చెందిన టొరంటో వెస్టర్న్ హాస్పిటల్ పరిశోధకులు తేల్చారు.

తమ పరిశోధనల వివరాలను కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించారు. స్మార్ట్ ఫోన్స్ ను ఎక్కువగా వాడకం వల్ల శారీరక అనారోగ్యాల తో పాటు మానసిక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వారు అంటున్నారు. ఫోన్స్ ను శ్రుతి మించి వాడితే డిప్రెషన్ బారిన పడి ఆ తర్వాత ఎప్పుడూ ఆత్మ హత్య చేసుకోవాలని ఆలోచిస్తారని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/