చీరలపై ముగ్గుల డిజైన్

ఫ్యాషన్‌ ..ఫ్యాషన్‌..

Saree designs
Saree designs

హిందువులు తమ ఇంటిఎదుట ముందు ఉదయాన్నే ముగ్గు వేసుకుంటారు. ఇవే ముగ్గుల డిజైన్లు చీరలు, జాకెట్లపై ప్రత్యక్షమైతే కట్టుకోవాలనిపిస్తుంది.

ముంగిట ముగ్గుల అలంకరణే కాదు ముచ్చట గొలిపే ఆ ముగ్గు డిజైన్‌తో ఉన్న చీరలను కట్టండి. ముగ్గులే కట్టారా అనిపించండి.

ప్లెయిన్‌ కాటన్‌ చీర మీద ముగ్గుల ప్రింటు, ఆ చీరను కట్టుకున్నవారిని చూస్తే ముగ్గు కొత్తభాష్యం చెబుతున్నట్లుగా ఉంటుంది.

తెలుగింటి ముగ్గుపట్టు చీర బ్లౌజ్‌కు ఎంబ్రాయిడరీగా అమరితే వేడుకలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. కొత్తగా ముగ్గు డిజైన్‌ వేయించుకోవాలనుకునే ప్లెయిన్‌ చీర, బ్లౌజ్‌, డ్రెస్సులను ఎంచుకోవచ్చు.

ఈ డిజైన్‌ బాగుండాలంటే చుక్కల ముగ్గునే ప్రింట్‌గా వేయించుకోవాలి. లేదా చేతి కుట్టుతో అందంగా రూపుకట్టాలి. అప్పుడే అల్లిక స్పష్టంగా తెలిసి అందంగా కనపడుతుంది.

ముగ్గు డిజైన్‌ కావాలనుకుని సాధారణ డిజైన్‌ని ఎంచుకుంటే ఎలాంటి ప్రత్యేకతా ఉండదు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/