దేశంలోనే టెస్టింగ్‌ కిట్లు తయారు చేస్తున్నాం

కరోనా నివారణలో కీలక దశకు చేరుకున్నాం: కిషన్‌రెడ్డి

kishan reddy
kishan reddy

దిల్లీ: కరోనా వ్యాప్తి నివారణలో కీలకదశకు చేరుకున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ర్యాపిడ్‌ టెస్టులను వేగవంతం చేస్తామని తెలిపారు. టెస్టింగ్‌ కిట్లను విదేశాల నుంచి తెప్పించడంతో పాటు మన దేశంలో కూడా తయారు చేస్తున్నామిని చెప్పారు. దేశంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటికి ప్రజలు ఎక్కువగా రోడ్లపైకి రాకుండా అనేక చర్యలు తీసుకుంటామని అన్నారు. దేశంలో వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా ఉండడానికిక వారికి అవసరమైన వసతి, ఆహరం మందుల ఏర్పాటుకై కేంద్రం రూ.12,000 కోట్ల నిధులు కేటాయించిందన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/