తిరుమలలో దంచికొట్టిన వాన

అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను వదిలిపెట్టడం లేదు. గత పది రోజులుగా రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఉరుములతో కూడిన వర్షాలు పడుతూనే ఉన్నాయి. తెలంగాణ లో మరో నాల్గు రోజుల పాటు వర్షాలు కురవనునట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక శనివారం సాయంత్రం తిరుమలలో ఉరుములు , మెరుపులతో భారీ వర్షం కురిసింది.

వర్షం వల్ల భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు, దర్శనానంతరం ఆలయం వెలుపలికి చేరుకున్న భక్తులు వర్షం దాటికి షెడ్ల కిందికి పరుగులు తీశారు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు వర్షం కారణంగా తీవ్రవస్థలు పడ్డారు. షాపింగ్ కాంప్లెక్స్, లోతట్టు ప్రాంతాలలోని దుఖానాలలోకి వర్షపు నీరు చేరడంతో వస్తువులు తడిసిపోయాయి. మొదటి, రెండో ఘాట్ రోడ్లలలో వర్షం కారణంగా అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉంది. దీంతో ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని భద్రతా సిబ్బంది సూచనలు చేస్తున్నారు.