కరోనాను పూర్తిగా నివారించే ఔషదం

చికాగో వైద్యబృందం వెల్లడి

remdesivir
remdesivir

చికాగో: ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తు, అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా మహామ్మారి అంతం చూసేందుకు దేశాలు ముమ్మర ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు కొత్త వ్యాక్సిన్‌ కనుక్కోడానికి ప్రయత్నాలు చేస్తునే, మరోవైపు ఉన్న ఇతర వ్యాధుల ఔషధాలలో ఏది కరోనాను ఎదుర్కోంటుందో పరీక్షిస్తున్నారు. అలా ఇపుడు మలేరియాకు ఉపయోగించే హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను కోరోనా నివరణకు ప్రపంచం మొత్తం వినియోగిస్తుండగా.. ఇపడు మరో ఔషదం కూడా కరోనాను పూర్తిగా నియంత్రిస్తుందని చికాగో వైద్యబృందం తెలిపింది. అదే రెమ్‌డెసివిర్‌. ఇది కరోనాను పూర్తిగా నియంత్రిస్తుందని చెప్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగులకు దీనిని ఇవ్వగా వారు 6 రోజులలో కోలుకున్నారని, ఆ తరువాత మరో వంద మందికిపైగా ఈ మందును ఇవ్వగా.. అందరికి పూర్తిగా తగ్గి ఇపుడు ఇద్దరు మాత్రమే మిగిలారని వైద్యులు తెలిపారు. చికాగోలో ఇప్పటికే రెండుసార్లు ఈ మందుపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయి. ఈ నెల చివరి వరకు రెమ్‌డెసివిర్‌ పనితీరుపై ఓ స్పష్టత వస్తుందని పరిశోధక బృందం చెబుతోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/