రామరాజ్యం స్ఫూర్తితో ఢిల్లీని పాలిస్తున్నాంః సీఎం కేజ్రీవాల్‌

We are ruling Delhi with the spirit of Rama Rajyam: CM Kejriwal

న్యూఢిల్లీః ఛత్రసాల్‌ స్టేడియంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాముడు ఎప్పుడూ కులాన్ని నమ్మలేదని, రామరాజ్యంలో అందరూ తమ మతాన్ని పాటించేవారన్నారు. రామయణంలా రామరాజ్యానికి నిర్వచనంలా నగరాన్ని పాలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భగవాన్‌ రాముడి నుంచి త్యాగం చేరుకుంటామని, ఆయన ఎప్పుడూ కులాన్ని నమ్మలేదని అన్నారు.

ఢిల్లీలో విద్యావ్యవస్థను మార్చామని, రామరాజ్యం స్ఫూర్తితో ఢిల్లీని పాలిస్తున్నామన్నారు. రామరాజ్యం అంటే ఆనందం, శాంతి పాలన అన్నారు. వృద్ధులను అయోధ్య రామ దర్శనానికి పంపుతామని సీఎం ప్రకటించారు. రామాయణంలోని రామరాజ్యానికి నిర్వచనంలా నగరాన్ని పాలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. రాముడు అనుసరించిన సూత్రాలను పాటించడం ముఖ్యమన్నారు.

విద్య నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు, ఢిల్లీ ఎవరూ ఆకలితో నిద్రపోకుండా చూడాలని కేజ్రీవాల్ అన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం అందరికీ అందాలన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇటీవల ప్రారంభించిన రామాలయానికి తమ ప్రభుత్వం త్వరలో యాత్రకు పంపనున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఇప్పటి వరకు 83వేల మందికిపైగా వృద్ధులను తీర్థయాత్రలకు పంపామన్నారు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అయోధ్య యాత్ర ప్రారంభించాలని చాలా అభ్యర్థనలు వచ్చాయని, త్వరలోనే వీలైనంత మందిని అక్కడికి తీసుకెళ్తామన్నారు.