మణిపూర్ పవన్ స్టేషన్ నుంచి భారీగా ఇంధన లీక్

heavy-fuel-leak-from-manipur-power-station

ఇంఫాల్‌ః మణిపూర్‌లో ఓ పవర్‌ స్టేషన్‌ నుంచి భారీగా ఇంధనం లీకైంది . దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఇంధన లీకేజీని కట్టడి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాంగ్‌పోక్పి జిల్లాలోని లీమాఖోంగ్‌ పవర్‌ స్టేషన్లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పవర్‌ స్టేషన్‌ నుంచి పెద్ద ఎత్తున ఇంధనం లీకైంది. కాసేపటికే అది రోడ్లపై వరదలా పారింది. కొన్ని చోట్ల భారీగా మంటలు కూడా చెలరేగాయి. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఇంధనం ఇంఫాల్‌ లోయ లోని నదిలో కలిసే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంధన లీకేజీని వెంటనే అదుపు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇంధన లీకేజీ కట్టడికి చర్యలు చేపట్టారు. మణిపూర్లో మొదలైన జాతుల మధ్య వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంధన లీక్ విషయంలో పోలీసులు అనుమానిస్తున్నారు