రేపు కెసిఆర్ అధ్య‌క్ష‌త‌న బిఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ భేటి

KCR

హైదరాబాద్ః 26వ తేదీన బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అధ్య‌క్ష‌త‌న బిఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఎర్ర‌వ‌ల్లిలోని కెసిఆర్ వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఈ భేటీ జ‌ర‌గ‌నుంది. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌మావేశానికి లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీల‌తో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు హాజ‌రు కానున్నారు.