హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

ఎల్బీ స్టేడియంలో బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం

aicc-president-shri-mallikarjuna-kharge-arrives-in-hyderabad

హైదరాబాద్‌ః ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఖర్గే హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఖర్గేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ కేడర్‌కు ఖర్గే దిశా నిర్దేశనం చేయనున్నారు. ఈ సమావేశంలో ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, నాయకులు పాల్గొననున్నారు.