ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వివరాలు

అమరావతి: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 73 మున్సిపాలిటీలతో పాటు, 11 కార్పొరేషన్లలో జయకేతనం ఎగురవేసింది. వైస్సార్సీపీ ప్రభంజనం ముందు ఇతర పార్టీలు నిలవలేకపోయాయి. టీడీపీ కొంత మేర పోటీ ఇచ్చినప్పటికీ… ఇతర పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ నమోదయిందనే వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

పార్టీలు, వాటికి పడిన ఓట్ల వివరాలు..

వైస్సార్సీపీ – 52.63 శాతం ఓట్లు
టీడీపీ – 30.73 శాతం
జనసేన – 4.67 శాతం
బీజేపీ – 2.41 శాతం
స్వతంత్రులు – 5.73 శాతం
నోటా – 1.07 శాతం

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/