నామినేష‌న్ దాఖ‌లు చేసిన క‌మ‌ల్‌హాస‌న్‌‌

చెన్నై: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థులు.. రాష్ట్ర‌వ్యాప్తంగా నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేస్తున్నారు. మ‌క్క‌ల్ నీధి మ‌య్యిం పార్టీ చీఫ్ క‌మ‌ల్ హాసన్ ఇవాళ త‌న నామినేష‌న్ వేశారు. కోయంబ‌త్తూర్ సౌత్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి క‌మ‌ల్ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక అమ్మా మ‌క్క‌ల్ మున్నేత్ర క‌జ‌గం పార్టీ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి టీటీవీ దిన‌క‌ర‌న్ కూడా ఇవాళ త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కోవిల్‌ప‌ట్టి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి దిన‌క‌ర‌న్ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/