నాదెండ్ల మనోహర్ వల్లే తోట చంద్రశేఖర్ జనసేన ను వీడుతున్నారా..?

ప్రస్తుతం ఏపీలో జనసేన హావ కొనసాగుతున్న వేళ..పార్టీ కీలక వ్యక్తి తోట చంద్రశేఖర్ పార్టీ ని వీడి బిఆర్ఎస్ లో చేరడం జనసేన నేతలను , కార్య కర్తలు , అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ తో నడిచి..పార్టీలో కీలకంగా ఉన్న చంద్రశేఖర్..ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో జనసేన ఫై నమ్మకం పెరుగుతున్న వేళ పార్టీ ని వీడడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన ఒక్కరే కాదు గోదావరి జిలాల్లో జనసేన పార్టీ కి కీలకంగా పనిచేస్తున్న వారిని సైతం బిఆర్ఎస్ లోకి తీసుకెళ్లడం కార్య కర్తలు తట్టుకోలేకపోతున్నారు. అసలు ఎందుకు సడెన్ గా చంద్రశేఖర్ పార్టీని వీడుతున్నారని అంత మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం వినిపిస్తున్న మాటల ప్రకారం..నాదెండ్ల మనోహర్ ప్రవర్తన నచ్చకనే పార్టీ ని వీడుతున్నట్లు చెపుతున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కు మొదటి నుండి మెగా బ్రదర్స్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు సమయంలో కీలకంగా వ్యవహరించారు. ప్రజారాజ్యం కార్యాలయం కూడా ఆయనే ఇచ్చింది. ప్రజారాజ్యం నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేసి 2009లో ఓడిపోయారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో తోట చంద్రశేఖర్ వైస్సార్సీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసినా.. ఓటమి పాలయ్యారు. ఇక, పవన్ తో ఉన్న సంబంధాలతో ఆ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. కానీ, గెలవలేదు. ఎన్నికల్లో గెలవకపోయినా.. పవన్ కల్యాణ్ ను సన్నిహితుడుగా జనసేన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. తన సొంత మీడియా ఛానల్ ను సైతం జనసేన కోసం వాడుకుంటూ వచ్చారు.

అలాంటి వ్యక్తి కేవలం నాదెండ్ల మనోహర్ తీరు వల్లే బయటకు వచ్చారనే ప్రచారం జరుగుతుంది. పార్టీ లో పార్టీలో ప్రస్తుతం పవన్ తర్వాత మొత్తం నాదెండ్ల మనోహర్ చూసుకుంటాడనే ప్రచారం కొద్ది రోజులుగా వినిపిస్తోంది. తోట చంద్రశేఖర్ లాంటి నేతలు పార్టీకి అండగా నిలుస్తున్నా.. ఎవరి మాటకు విలువ దక్కటం లేదనే చర్చ కూడా నడుస్తుంది. వ్యక్తిగతంగా పవన్ – తోట చంద్రశేఖర్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని..పార్టీలో సొంతంగా ఎదిగే అవకాశాలు ఉన్నా.. టీడీపీతో పొత్తు దిశగా పవన్ ను మనోహర్ ప్రభావితం చేస్తున్నారనేది వాదన. దీని కారణంగానే చంద్రశేఖర్ కొంత కాలంగా జనసేనలో స్తబ్దుగా ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఉన్న సంబంధాలతో ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారని అంటున్నారు. మరి బిఆర్ఎస్ తో తోటచంద్రశేఖర్ కు ఎంత మేలు జరుగుతుందా అనేది చూడాలని అంత అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ చంద్రశేఖర్ జనసేన ను వీడడం ఫై జనసేన కార్య కర్తలు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.