విటమిన్ల లోపం..గుర్తించటం ఎలాగంటే ?

ఆహారం-ఆరోగ్యం-అవగాహన

Vitamin deficiency ..Identifying
Vitamin deficiency ..Identifying

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయట పడుతూ ఉంటుంది.. కాబట్టి ఆ లక్షణాల పట్ల అవగాహన ఏర్పరుచుకుని .. ఆ విటమిన్ పరిమాణాన్ని పెంచి డెఫీషియన్సీ ని అరికట్టాలి..

  • నోటి చివర్లలో: నోటి చివర్లలో పగుళ్లు ఏర్పడుతుంటే జింక్, ఐరన్, బి విటమిన్లు ( నియాసిన్, రైబో ఫ్లోవిన్ , విటమిన్ బి 12) లోపంగా భావించాలి .
  • చర్మం: చర్మం మీద ఎర్రని, పొట్టుతో కూడిన రషెస్ తో పాటు , వెంట్రుకలు రాలుతూ ఉంటే నీటిలో కరిగే బయోటిన్ (విటమిన్ బి7) లోపంగా గుర్తించాలి.
  • తిమ్మిర్లు: అరచేతులు, పాదాల్లో చురుక్కు మనటం, తిమ్మిర్లు ఉన్నా , మొద్దుబారిన బి విటమిన్ల ( ఫోలేట్, బి6, బి12) లోపమని గ్రహించాలి..
  • కండరాల నొప్పులు: కాలి బొటన వేళ్ళు, పిక్కలు, పాదాలు, కాళ్లలో పోట్లు ఉంటే మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం లోపం ఉందని తెలుసుకోవాలి.

‘నాడి’ (ఆరోగ్య సంబంధిత) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health1/