ఎండుకొబ్బరితో ప్రయోజనాలెన్నో!

ఆరోగ్యం-పోషకాలు

Benefits of Dry Coconut!
Benefits of Dry Coconut!

పచ్చికొబ్బరి టేస్ట్‌ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు అయితే అదే పచ్చి కొబ్బరిని ఎండబెట్టి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

పైగా ఎక్కువ కాలం నిలువ ఉంటుంది కూడా. బరువు తగ్గాలి అంటే ఎండుకొబ్బరి తినాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎండుకొబ్బరి టేస్ట్‌ చూడాలి.

ఇంకా చాలా ప్రయోజనాలు. డ్రై కోకోనట్‌ జీర్ణం అవడానికి కాస్త టైమ్‌ తీసుకుంటుంది కానీ మన శరీరానికి మాత్రం ఎంతో మేలే చేస్తుంది.

ఎండుకొబ్బరిలో ఫైబర్‌, కాపర్‌, సెలీనియం వంటి పోషకాలుంటాయి.

అందుకే చాలా వంటలు, స్వీట్లలోఎండుకొబ్బరిని వేస్తారు. మార్కెట్లో ఎండుకొబ్బరి పొడి కూడా దొరుకుతుంది.

అది కొనుక్కుని కూరల్లో కాస్త వేసుకుంటూ ఉంటే ఇంటిల్లిపాదికీ ఆరోగ్యం. తరచూ తలనొప్పులతో బాధపడేవారు రోజూ కాస్తంత ఎండుకొబ్బరి తింటూ ఉంటే బ్రెయిన్‌ చక్కగా పనిచేస్తుంది.

అంతేకాదు రకరకాల వ్యాధుల్ని తరిమికొట్టే శక్తి కూడా డ్రై కోకోనట్‌కు ఉంది. ఎండుకొబ్బరిలో ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఎక్కువ అనే ఉద్దేశంతో కొంత మంది దాన్ని తినరు.

కానీ అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు కూడా ఉంటాయి.

ఎండుకొబ్బరిలో ఫైబర్‌, కాపర్‌, మ్యాంగనీస్‌, సెలీనియం ఉంటాయి. రోజు చిన్న ఎండుకొబ్బరి ముక్క తింటే అందులోని ఫైబర్‌ వల్ల గుండె హాయిగా ఉంటుంది.

మగవాళ్లు రోజూ 38 గ్రాములు తీసుకోవాలి. ఆడవారు 25 గ్రాములు తినాలి. ఈ రోజుల్లో సౌండ్‌ పొల్యూషన్‌, టెన్షన్స్‌ వల్ల చాలా మందికి బ్రెయిన్‌దెబ్బతింటోంది.

తల తిరుగుతోంది. అలాంటి వాళ్లు రోజూ ఎండుకొబ్బరి తింటే ఓ వారం తర్వాత మంచి మార్పు కనిపిస్తుంది. బ్రెయిన్‌ బాగా పనిచేస్తుంది. మతిమరపు సమస్యలు దూరమవుతాయి.

ఎండుకొబ్బరి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్‌ వ్యాధి ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. కానీ రోజు ఎండుకొబ్బరి తినేవాళ్లకు క్యాన్సర్‌ రావడం లేదు.

వ్యాధి సోకిన వాళ్లు కూడా ఎండుకొబ్బరి తింటే ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేవుల్లో కాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కి ఎండుకొబ్బరి చక్కటి మందులా పనిచేస్తుంది.

మలబద్ధకం, అల్సర్‌ వంటి సమస్యలు ఉంటే ఇది ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది.

మనదేశంలో మహిళలకు రక్తహీనత ఎక్కువ. సరిపడా బ్లడ్‌ ఉండాలంలే ఎండుకొబ్బరి తింటే మంచిది. ఫలితంగా ఐరన్‌ పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/