ఉమ్మ నీరు పెరిగేందుకు..

గర్భిణీల ఆహారం -ఆరోగ్య పరిరక్షణ

గర్భిణీల్లో ఉమ్మ నీరు తగ్గితే చాలా ప్రమాదం.. శిశువు కదిలేందుకు ఇబ్బంది అవుతుంది.. కాబట్టి కొన్ని ఆహార మార్పులతో ఉమ్మ నీరుని పెంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఉమ్మ నీరు స్థాయిలను పెంచాలంటే తగినన్ని నీళ్లు తాగాలి.. పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.. వీటితో వేగంగా ఉమ్మ నీరు అభివృద్ధి చెందుతుంది. నీరు అధికంగా ఉండే దోసకాయలు, పాలకూర , బ్రకోలీ, టొమాటో , క్యాలీఫ్లవర్ , క్యారెట్ వంటివి తినాలి… వీటితో శరీరానికి సరిపడా నీరు సమృద్ధిగా అందుతుంది. పుచ్చకాయ, ద్రాక్ష, దానిమ్మ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో నీరు అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే సరి.. కొబ్బరి నీళ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. వికారాన్ని తగ్గించి, అజీర్తి సమస్యలను దూరం చేస్తాయి. ఉమ్మ నీరును వృద్ధి చేయటమే కాకుండా శిశువు ఎదుగుదలకు కూడా ఉపయోగ పడతాయి. అన్నింటికంటే ముందు డాక్టర్లను సంప్రదిస్తే అవసరాన్ని బట్టి తగిన మందులు సూచిస్తారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/category/andhra-pradesh/