కేసీఆర్ ఫై రాములమ్మ పోటీ..?

తెలంగాణ ఎన్నికల సమరం మొదలైంది. మరో రెండు , మూడు నెలల్లో శాసన ఎన్నికలు జరగబోతుండడం తో అధికార పార్టీ ఇప్పటి నుండే అభ్యర్థులను ప్రచారానికి సిద్ధం చేసింది. సోమవారం ముహూర్తం బాగుందని చెప్పి..పార్టీ అధినేత కేసీఆర్ 115 తో కూడిన అభ్యర్థుల లిస్ట్ తో పాటు వారు ఎక్కడినుండి పోటీ చేయబోతున్నారనేది ప్రకటించారు. ఇదే క్రమంలో తాను ఈసారి రెండు చోట్ల నుండి బరిలోకి దిగబోతున్నట్లు స్పష్టం చేసారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గాల నుండి కేసీఆర్ బరిలోకి దిగబోతున్నాడు. కేసీఆర్ రెండు చోట్ల నుండి పోటీ చేయడం ఫై ప్రతిపక్ష పార్టీ లు విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటె కామారెడ్డి నుండి కేసీఆర్ కు పోటీగా రాములమ్మ విజయశాంతి బిజెపి నుండి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో మెదక్ MPగా గెలిచిన విజయశాంతి… ఈసారి కూడా లోక్ సభకు పోటీ చేయాలనుకున్నారు. కానీ KCRను ఓడించే లక్ష్యంతో కామారెడ్డి నుంచి బరిలో దిగాలని విజయశాంతి భావిస్తున్నారని చెబుతున్నారు. అదే నిజమైతే బిజెపి అధిష్టానం ఓకే చెప్తుందో లేదో వేచి చూడాలి.