తెలంగాణ ఎన్నికల్లో సింగిల్ గా బరిలోకి దిగబోతున్న టీడీపీ

తెలంగాణ లో మరో రెండు , మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో సోమవారం అధికార పార్టీ తమ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించి..ఎన్నికల సమరశంఖం మోగించింది. బిఆర్ఎస్ ప్రకటన తో మిగతా అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో పడ్డాయి. టీడీపీ పార్టీ సైతం ఎన్నికల్లో పోటీ చేయాలనీ చూస్తుంది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగబోతున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు.

హైదరాబాద్‌లోని తన నివాసంలో నిన్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాసాని బస్సు యాత్ర, అభ్యర్థులు, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించారు. తమ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాతే బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.