బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు..మనల్ని ఎవడ్రా ఆపేది

బీఆర్ఎస్ లో భారీగా చేరికలు నడుస్తున్నాయి. తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా తీసుకురావడమే కాదు తొమ్మిదేళ్ల లో ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి జరగనంతగా అభివృద్ధి పధంలో కేసీఆర్ అభివృద్ధి చేస్తుండడం తో మిగతా రాష్ట్రాలన్నీ కూడా కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. ప్రజల కోరిక మేరకు టిఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చి, జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కేసీఆర్. ఇక ఇప్పుడు దేశం మొత్తం కేసీఆర్ అడుగుజాడల్లో నడిచేందుకు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఓ వెలుగువెలిగిపోతుంది. పెద్ద ఎత్తున ఇక్కడ నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇప్పటీకే పలుపార్టీలలో ఉన్న నేతలంతా ఆయా పార్టీలకు రాజీనామా చేసి , బీఆర్ఎస్ లో చేరారు.

తాజాగా శనివారం తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మక్షంలో మ‌హారాష్ట్ర షోలాపూర్‌కు చెందిన కార్పొరేట‌ర్ న‌గేశ్‌తో పాటు ఆయ‌న మ‌ద్ద‌తుదారులు, ఇత‌ర నాయ‌కులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ వారంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. గత కొంతకాలం నుంచి మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం మహారాష్ట్రకు చెందిన బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 200 నుంచి 300 మంది నేతలు, కార్యకర్తలు పలువురు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ భవన్ లో పార్టీలో చేరారు.

పుట్టిన గడ్డ తెలంగాణ అయితే పెంచిన తల్లి మహారాష్ట్ర అన్నారు ఓ నేత దశరథ్ . షోలాపూర్ లో చాలా వరకు తెలుగు వారు ఉంటారని చెప్పారు. మహారాష్ట్రలో బాంబే, షోలాపూర్, పుణే లాంటి నగరాలలో బీఆర్ఎస్ ట్రెండ్ మొదలైందన్నారు. కొన్ని నెలల కిందట మీతో సమావేశం అయినప్పుడు బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. గతంలో తన తండ్రి బీజేపీ తరఫున ఓసారి ఎమ్మెల్యే, 2 పర్యాయాలు ఎంపీగా చేశారని గుర్తుచేశారు దశరథ్. 4 నెలల కిందట నేను బీఆర్ఎస్ లో చేరతానని భావించలేదు. కానీ ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి మారిపోయిందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, జీవ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.