మరోసారి ప్రధాని మోడీ ఫై తన అభిమానాన్ని చాటుకున్న బండి సంజయ్

కరీంనగర్ బిజెపి ఎంపీ సంజయ్ మరోసారి ప్రధాని మోడీపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రధాని మోడీ నేడు వరంగల్ లో పర్యటించారు. రూ. 6,100 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సభ వేదికగా మరోసారి మోడీ కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. అలాగే మిగతా బిజెపి నేతలు సైతం కేసీఆర్ ప్రభుత్వం ఫై వారి స్టయిల్ లో విమర్శలు చేసారు. అయితే బండి సంజయ్ మాత్రం కేసీఆర్ ప్రభుత్వం ఫై విమర్శల కన్నా, మోడీ ఫై ప్రశంసలు ఎక్కువగా కురిపించారు.

సీఎం కేసీఆర్‌ను కొద్ది సేపు విమర్శించిన తర్వాత ఆయన మొత్తం ప్రధాని మోడీ ఫై ప్రశంసలు కురిపించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. మోదీ ది బాస్…. ప్రపంచమే పాదాభివందనం చేస్తున్న మహానుభావుడు ఈ ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టిన ప్రధానమంత్రి మోడీకి స్వాగతం అన్నారు. 6 వేల 100 కోట్ల నిధులతో అభివృద్ది పనులకు ముఖ్యంగా కరీంనగర్ –వరంగల్ జాతీయ రహదారుల పనులు ప్రారంభించేందుకు వచ్చిన మోదీకి ధన్యవాదాలు అన్నారు.

కొంతమంది బిఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని మోడీ వచ్చారని అడుగుతున్నారు… 6 వేల 100 కోట్ల నిధులతో అభివృద్ది పనులు ప్రారంభించేందుకు వచ్చారన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కేఎంసీ ఆసుపత్రికి నిధులు మంజూరు చేస్తూ వచ్చారన్నారు. టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు వచ్చారన్నారు. స్మార్ట్ సిటీ నిధులిచ్చినందుకు వచ్చారన్నారు. కేసీఆర్…..మోదీ నీ దోస్త్ అన్నవ్ కదా ? నువ్వెందుకు రాలేదు ? రావడానికి నీకు ముఖం లేదు… నీకు నిజంగా ప్రజల పట్ల ప్రేమ, అభివృద్ధి చేయాలని ఉంటే ఇక్కడికి రావాలి కదా… మోదీ వస్తే కేసీఆర్ కు కోవిడ్ వస్తది… బిజీ అవుతారని సెటైర్ వేశారు. నరేంద్రమోదీకి ప్రజలంతా లేచి చప్పట్లు కొట్టాలి… మీరు జై మోదీ అనే నినాదాలతో కేసీఆర్ చెవుల నుండి రక్తం కారాలని పిలుపునిచ్చారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనను అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా, కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశమిచ్చిన బీజేపీకి రుణపడి ఉంటా…శిరస్సు వంచి దండాలు పెడుతున్నానన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా లో బండి సంజయ్ స్పీచ్ వైరల్ గా చక్కర్లు కొడుతుంది.