హైదరాబాద్‌ పోలీసులకు ‘వార్త’ మాస్కుల అందజేత

యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపిన పోలీసు కమిషనర్‌

Gaurav Sanghi, ED, Vaartha who handed over the masks to Police Commissioner Anjani Kumar
Gaurav Sanghi, ED, Vaartha who handed over the masks to Police Commissioner Anjani Kumar

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడికి నిత్యం సిటీలో అహర్నిశలు డ్యూటీలు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ‘వార్త’ చేయూతనిచ్చింది.

ఈమేరకు వారికి అవసరమైన మాస్కులను ‘వార్త యాజమాన్యం తనవంతు సహాయంగా అందజేసింది.

తాజాగా ‘వార్త’ తెలుగు జాతీయ దినపత్రిక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గౌరవ్‌సంఘీ హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ను కలిసి వెయ్యి మాస్కులను అందజేశారు.

‘వార్త ‘ఎడిటర్‌ దామెర్ల సాయిబాబ కూడ ఉన్నారు. ఈసందర్భంగా పోలీసులకు మాస్కులను అందజేసిన ‘వార్త’ యాజమాన్యానికి పోలీసు కమిషనర్‌ ధన్యవాదాలు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/