జియోలో ఫేస్‌బుక్‌ భారీ ఇన్వెస్ట్‌మెంట్‌

9.99 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం

Reliance-Jio - Facebook
Reliance-Jio – Facebook

ముంబయి: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియోప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ లో 9.99 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ భారీ పెట్టుబడిని పెట్టనుంది. ఇండియాలో తమ డిజిటల్ ఆపరేషన్స్ పరిధిని మరింతగా విస్తరించుకోవాలన్న ఆలోచనలో ఉన్న ఫేస్ బుక్, జియోలో ఏకంగా రూ. 43,574 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. వాస్తవానికి ఈ నెలాఖరులో ఫేస్‌ బుక్ ‌తో ఈ డీల్ గురించి జియో ప్రకటిస్తుందని భావించినా, అంతకు ముందే జియో దీనిపై మీడియా ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం, ఫేస్ బుక్ పెట్టుబడి తరువాత జియో ప్లాట్ ఫామ్స్ విలువ రూ. 4.62 లక్షల కోట్లకు పెరిగినట్లవుతుంది.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/