వైస్సార్సీపీ , ప్రభుత్వానికి ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు

సంసద్ టీవీ సీఈవోకు విజయసాయి లేఖ

vijayasaireddy

అమరావతి: వైస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును పొలిటికల్ డిబేట్లకు అనుమతించవద్దని సంసద్ (పార్లమెంటు) టీవీ సీఈవోకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రఘురామకృష్ణరాజు ఏపీ ప్రభుత్వానికి కానీ, వైపీసీకి కానీ ప్రాతినిధ్యం వహించడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆయన లోక్ సభ అభ్యర్థిత్వంపై అనర్హత పిటిషన్ స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉందని చెప్పారు. ఈ లోక్ సభ కాలపరిమితి ముగిసేంత వరకు ఆయనను టీవీ చర్చల్లో భాగస్వామిని చేయవద్దని కోరారు.

మరోవైపు దీనిపై రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో స్పందించారు. పార్టీ నుంచి తనను బహిష్కరించకుండా… టీవీ చర్చలకు అనుమతించవద్దని ఎవరూ లేఖలు రాయలేరని చెప్పారు. చేతనైతే తనను పార్టీ నుంచి బహిష్కరించాలని సవాల్ విసిరారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/