టోక్యో ఒలింపిక్స్‌ ఏడాది పాటు వాయిదా వేయండి

పోటీలు ఆగబోవంటున్న జపాన్

Tokyo Olympics could postpone for a year- Trump
Tokyo Olympics could postpone for a year- Trump

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) క్రీడారంగంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈనేపథ్యంలో ఈ సంవత్సరం జపాన్ లోని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ పోటీలను నిర్వహించ వద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కనీసం ఏడాది పాటు పోటీలను వాయిదా వేయాలన్నారు. గురువారం టోక్యో అధికారులకు ట్రంప్‌ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్ కు మిగతా దేశాల నుంచి ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదని, అప్పుడు పోటీలే బోసిపోతాయని అభిప్రాయపడ్డ ఆయన, అనేక క్రీడా టోర్నీలు రద్దయ్యాయని గుర్తు చేశారు. ప్రేక్షకులు లేకుండా ఇంత పెద్ద ఈవెంట్ జరగడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. మరోవైపు కరోనా ప్రభావం ఎలా ఉన్నా, పోటీలు ఆగబోవని, వీటిని ఆపబోమని టోక్యో గవర్నర్ యురికో కొయ్కే గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పోటీల్లో పాల్గొనాలని భావించే వారంతా ప్రాక్టీస్ ను కొనసాగించాలని ఇటీవలే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కూడా సూచించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/